తెలంగాణలో మద్యంతో పాటు ఏఏ ఛార్జీలు పెరుగుతున్నాయంటే

తియ్యటి మాటలతో శుష్క ప్రియులు శూన్య హస్తాలు చెబితే బతకడం సాధ్యమవుతుందా కాంగ్రెస్  పార్టీని  ప్రశ్నించారు అని సీఎం కేసీఆర్ . అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ  రాష్ట్రాభివృద్ధి కోసం, ఆర్ధిక మనుగడ సాధించాలంటే కొన్ని రంగాల్లో మార్పులు చేయడం అవసరమని అన్నారు. ఈ సందర్భంగా  రిజిస్ట్రేషన్, ఇసుక, మైన్స్, కరెంట్ , మద్యం ధరల్ని పెంచబోతున్నట్లు ప్రకటించారు. టీఆర్ఎస్ హయాంలో ఏం ఛార్జీలు పెంచలేదని, కాంగ్రెస్ హయాంలోనే ఛార్జీలు విపరీతంగా పెంచారన్న కేసీఆర్…మునిగిపోయే దశలో ఉన్న ఆర్టీసీని రక్షించేందుకు ఛార్జీలు పెంచామన్నారు. పెంచిన ఛార్జీలతోనే బడ్జెట్ లో ఆర్టీసీకి వెయ్యికోట్ల బడ్జెట్ కేటాయించామని సూచించారు. ఆర్టీసీని మళ్లీ లాభాల బాట పట్టించేందుకు గూడ్స్  పద్దతిని అవలంభిస్తున్నామని, త్వరలో ఆ ప్రక్రియ పూర్తవుతుందన్నారు.

తెలంగాణ తెచ్చిందో ఎవరో అందరికి తెలుసు

తెలంగాణ తెచ్చింది టీఆర్ఎస్ పార్టీయేనని , ఆ విషయం అందరికి తెలుసన్నారు. ఎవరు ఏం చెప్పినా తెలంగాణ కోసం సచ్చేందుకు సిద్ధపడి, పేగులు తెగేదాకా కొట్లాడి, ఉపవాసం ఉండో, ఉప్పు నిండో తెలంగాణ తెచ్చింది టీఆర్ఎస్సేనని అన్నారు. దీన్ని తాము చెడగొట్టమని..రాష్ట్రాభివృద్ధి కోసం ఏ దారికి తీసుకుపోవాలో ఆ దారికే తీసుకుపోతామని, ఈ విషయం లో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తిలేదన్నారు.

రాష్ట్ర ప్రగతిని దెబ్బతీయం

తెలంగాణ రైతాంగం, సమాజానికి ఎట్టిపరిస్థితుల్లో నష్టం వాటిల్లే కార్యక్రమాలు చేపట్టమని అన్నారు. 100శాతం కమింట్మెంట్ తో పనిచేస్తూ రాష్ట్రప్రగతి దెబ్బతినకుండా కాపాడుకుంటామన్నారు. ఆర్ధిక మాంధ్యం, కరోనా పట్టిపీడుస్తున్నా.. కొన్ని రంగాల వారీగా ఛార్జీలు పెంచి  రాష్ట్రా ఆదాయాన్ని పెంచుతామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

మద్య పాన నిషేదం అట్టర్ ప్లాప్ అయ్యింది

సీఎం కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ త్వరలోనే మద్యం ధరలతో పాటు  కరెంట్ ఛార్జీలు పెంచుతామని ప్రకటించారు. గతంలో మద్యపాన నిషేదం విధిస్తే అట్టర్ ప్లాప్ అయ్యిందన్న కేసీఆర్..మద్యం తాగకుండా ఉండేలా ధరల్ని పెంచుతున్నట్లు తెలిపారు.

Latest Updates