మంచిగ మాట్లాడితే..మంచిగనే ఉంటది..లేదంటే

సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ లో మాట్లాడిన కేసీఆర్ .. సభలో మంచిగా మాట్లాడితే..మంచిగానే సమాధానం ఉంటుందన్నారు. మంచిని మంచి అనే సంస్కారం కాంగ్రెస్ కు లేదని మండిపడ్డారు. ఆంధ్ర వాళ్ళు పరిపాలన చేసుకోవడం చేతకాదని అంటే .. కాగ్ ఆడిట్ జనరల్  తెలంగాణ పాలన బాగుందని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.  ఏ ప్రభుత్వమైన మంచిగా పనిచేయాలని అనుకుంటుందన్న  సీఎం..ఒకటి రెండు పనులు సక్కగా చేయకపోతే విమర్శలు చేయొచ్చన్నారు. కానీ కాంగ్రెస్ అదేపనిగా విమర్శలు ఎందుకు చేస్తుందన్ని ప్రశ్నించారు.

 రైతులు కాలుమీద కాలువేసుకొని పంటలు పండిస్తున్నారు

రాష్ట్రంలో  నీళ్లు అద్భుతంగా ఉన్నాయి కాబట్టే  రైతులు కాలు మీద కాలు వేసుకొని పంటలు పండించుకుంటున్నారని, ఆ  విషయం కాంగ్రెస్ కు కనిపించడం లేదా అని అన్నారు.

ప్రభుత్వం గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకుంటాం

రాష్ట్ర ప్రభుత్వం గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు ప్రతీ అంశంపై సర్వేలు చేస్తామన్నారు సీఎం కేసీఆర్ . సర్వేల ఆధారంగా ప్రజల అభిప్రాయం తెలుసుకునే ఆసరా పెన్షన్లు 1000 నుంచి 2000 కు పెంచామని అన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగలేకపోతే సంక్షేమ కార్యక్రమాలు ఎలా అమలు చేస్తామని అన్నారు.

అప్పులు చేసిన అమెరికానే అగ్రస్థానంలో ఉంది

అప్పుల చేసిన అమెరికా ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా పేరుగడిస్తున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. అందుకే తాము అప్పులు తెచ్చిఇరిగేషన్ కోసం కేటాయించామని, రైతులు పంటలు వేసుకుంటే  అప్పులు తీరిపోతాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

మద్యం ధరలు పెంచుతాం

సీఎం కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ త్వరలోనే మద్యం ధరలతో పాటు  కరెంట్ ఛార్జీలు పెంచుతామని ప్రకటించారు. గతంలో మద్యపాన నిషేదం విధిస్తే అట్టర్ ప్లాప్ అయ్యిందన్న కేసీఆర్..మద్యం తాగకుండా ఉండేలా ధరల్ని పెంచుతున్నట్లు తెలిపారు.

Latest Updates