సింగరేణి కార్మికులకు దసరా కానుక

సీఎం కేసీఆర్ సింగరేణి కార్మికులకు దసరా కానుక ను ప్రకటించారు. ఈసారి లాభాల్లో 28 శాతం వాటా కార్మికులకు ఇస్తామని సీఎం కేసీఆర్  ప్రకటించారు.  ఒక్కో కార్మికుడికి రూ.1,00,899 ల బోనస్ చెల్లిస్తామని శుభవార్తనందించారు.  సింగరేణిపై అసెంబ్లీలో ప్రకటన చేసిన  ముఖ్యమంత్రి.. కార్మికుల శ్రమ వల్లే  సంస్థ లాభాల్లో ఉందన్నారు. సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురైన సింగరేణి.. తెలంగాణ వచ్చాకే ప్రగతిపథంలో దూసుకుపోతుందని చెప్పారు. గత నాలుగేళ్లుగా సింగరేణి లాభాల్లో ఉందని, 2018-19 సంవత్సరానికి రూ. 1565 కోట్ల లాభం వచ్చిందని సీఎం తెలిపారు.

Latest Updates