ముగిసిన 30 రోజుల ప్రణాళిక: ఉద్యోగులను మెచ్చుకున్న కేసీఆర్

గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం తలపెట్టిన 30 రోజుల ప్రణాళికను విజయవంతం చేసిన ఉద్యోగులను సీఎం కేసీఆర్ అభినందించారు.  ప్రగతిభవన్ లో ఉద్యోగసంఘాలనేతలు… మంత్రి శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో సీఎం ను కలిశారు. ఉద్యోగులందరూ శ్రమపడి ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతం చేశారని అన్నారు. అక్టోబర్21న ఎన్నికల కోడ్ ముగియగానే ఉద్యోగసంఘాల నాయకులను పిలిపించుకుని దశలవారిగా సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ ను కలిసిన వారిలో రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ అధ్యక్షు కారం రవిందర్ రెడ్డి, సెక్రటరీ జనరల్ వి.మమత, టీఎన్జీవో ప్రధానకార్యదర్శి మామిళ్ల రాజేందర్, టిజివో ప్రధాన కార్యదర్శి ఎ.సత్యనారాయణ, జ్ఞానేశ్వర్… తదితరులు పాల్గొన్నారు.

 

 

Latest Updates