ముగ్గురు కలెక్టర్లను అభినందించిన కేసీఆర్

గ్రామీణాభివృద్ధి, పారిశుద్ధ నిర్వహణలో రాష్ట్రానికి చెందిన ముగ్గురు కలెక్టర్లకు కేంద్ర ప్రభుత్వం అవార్డులు అందించింది. పెద్దపల్లి కలెక్టర్ దేవసేన, సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు, భూపాలపల్లి కలెక్టర్ వెంకటేశ్వర్లకు అవార్డులు లభించాయి. దీంతో సీఎం కేసీఆర్ ముగ్గురు కలెక్టర్లను ప్రత్యేకంగా అభినందించారు.  గ్రామీణాభివృద్ధిలో ప్రతీఒక్కరు భాగం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గ్రామాలు బాగుపడితేనే దేశం బాగుపడుతుందన్న బాపూజీ బాటలో నడవాలని ఆయన అన్నారు. ఒకే రాష్ట్రానికి చెందిన ముగ్గురు కలెక్టర్లకు కేంద్ర ప్రభుత్వంచే అవార్డులు తీసుకోవడం గర్వకారణమని చెప్పారు. గ్రామాభివృద్ధిలో చెట్ల పెంపకం కూడా ఎంతో విలువైందని ఇప్పటికే రాష్ట్రంలో మనం మొక్కలు పెంచే కార్యక్రమాన్ని ముందుకుతీసుకెళ్లామని చెప్పారు.

Latest Updates