మిషన్ భగీరథ నీళ్లలో మినరల్స్.. ఈ నీటినే తాగాలని సీఎం పిలుపు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మిషన్ భగీరథ ద్వారా ఆరోగ్య కరమైన, పరిశుద్ధమైన మంచినీళ్లు అందుబాటులోకి వచ్చినందున ప్రజలు వాటిని తాగేలా ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను కోరారు. మిషన్ భగీరథ నీళ్లు ప్రస్తుతం బాటిళ్ల ద్వారా కూడా అందుబాటులోకి వచ్చినందున గ్రామ పంచాయతీ నుంచి రాష్ట్ర సచివాలయం వరకు ఈ నీటినే వినియోగించాలని కోరారు. ప్రజలకు కూడా మిషన్ భగీరథ నీటిని తాగాలని పిలుపునిచ్చారు. మిషన్ భగీరథ నీళ్లలో అన్ని మినరల్స్ తగిన పాళ్ళలో ఉన్నాయని చెప్పారు.

Latest Updates