
జీహెచ్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ జీహెచ్ ఎంసీలో టీఆర్ఎస్ ను గెలిపిస్తే వరదల నుంచి హైదరాబాద్ కు శాశ్వత పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు.
టీఆర్ఎస్ సభలో కేసీఆర్ స్పీచ్
♦ ఇప్పటికే అందరి అంచనాలను తలకిందులు చేసి ఎలాంటి వివక్షత లేకుండా ఆరేళ్లలో అభివృద్ధి చేసి చుపించా
♦ ఎక్కడా మత,కుల వివక్షలేకుండా ఆచరించి…ఎవరూ ఊహించని విజయాలు సాధించాము
♦ ఏడెనిమిది నెలల్లోనే కరెంట్ సమస్య లేకుండా చేశాము
♦ 29 రాష్ట్రాల్లో కరెంట్ అందించడంతో తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచింది
♦ హైదరాబాద్ లో ఉన్న వాళ్లంతా మా బిడ్డలే
♦ హైదరాబాద్ లో అందరికీ మంచినీటి కొరత లేకుండా చేశాం
♦ 24 గంటలు నీటి సధుపాయం కల్పించేది నా కల
♦ ఆదర్శంగా పథకాలు అమలు చేశాం
♦ ప్రతి గ్రామపంచాయతీలో ఆస్పత్రి ఉంది..దేశంలో ఎక్కడా లేదు
♦ కంటి వెలుగు ప్రోగ్రాంతో పేదలకు అద్దాలు అందించాము
♦ కళ్యాణ లక్ష్మి..కేసీఆర్ కిట్ ఏ కులానికి ,మతానికి సంబంధించింది కాదు
♦ రైతు బంధు, రైతు భీమాతో రైతులకు ప్రభుత్వం బరోసాగా ఉంది
♦ హైదరాబాద్ లో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశాం
♦ గీత, మత్స్య ,యదవ కుటుంబాలను ఆదుకున్నాం
♦ దోబీ గాట్లకు వాడుకునే విద్యుత్ కు సంబధించి బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదు
♦ అలాగే నాయిబ్రహ్మణులు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు