రామేశ్వరంలో సీఎం కేసీఆర్, కేటీఆర్

తమిళనాడులో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. ఈ ఉదయం రామేశ్వరం గుడిని సందర్శించారు సీఎం కేసీఆర్.  ఆయనతోపాటు.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్, ఇతర కుటుంబసభ్యులు అందరూ దైవదర్శనం చేసుకున్నారు. జ్యోతిర్లింగ క్షేత్రమైన రామేశ్వరంలో రామనాథస్వామిని దర్శించుకున్నారు. హిందూ దేవాలయాల్లోనే రామేశ్వరానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. సుదూర కారిడార్ ఈ గుడికి ప్రత్యేకత. 12వ శతాబ్దంలో పాండ్యరాజులు కట్టించిన ఈ ఆలయంలో ప్రత్యేకతల గురించి ముఖ్యమంత్రి ఆలయ అధికారులతో ముచ్చటించారు. ఆలయ ఆధికారులు, ప్రధాన పూజారులు కేసీఆర్, కేటీఆర్ , కుటుంబసభ్యులకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు అందించారు.

రామేశ్వరం ఆలయంలో..  ధనుష్కోటి, రామసేతు, పంచముఖ హనుమాన్ లను కూడా ముఖ్యమంత్రి సందర్శించారు.

Latest Updates