హుజూర్ నగర్ లో సీఎం సభకు చురుగ్గా ఏర్పాట్లు : ఎమ్మెల్సీ పల్లా

హుజూర్ నగర్ ప్రజలు అదృష్టవంతులని టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. అందుకే వారు ఈ ఉప ఎన్నికల్లో అభివృద్ధిని కోరుకుంటున్నట్లు చెప్పారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ..హుజూర్ నగర్ ఉప ఎన్నికల ప్రచారంలో నిర్వహించే సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతున్నట్లు  తెలిపారు. ప్రచారంలో భాగంగా ఈనెల 17న నిర్వహించే  సభకు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.  సబ్బండ వర్ణాల ప్రజలు తరలి వచ్చే ఈ సభ ట్రెండ్ సెట్టర్ కాబోతున్నందని అన్నారు. ఈ సభలో కేసీఆర్ చేసే ప్రసంగం వినేందుకు, ఆయన్ని చూసేందుకు నియోజకవర్గ ప్రజలు ఉత్సాహంగా ఉన్నారన్నారు.  హుజూర్ నగర్ నియోజకవర్గంలో పులిచింతల ముంపు బాధితుల సమస్య, రెవెన్యూ సమస్యల్ని ప్రభుత్వం పరిష్కరిస్తుందని పల్లారాజేశ్వర్ రెడ్డి హామీ ఇచ్చారు.

Latest Updates