సంజయ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలి : కేసీఆర్

cm-kcr-birthday-wishes-to-karimnagar-mp-bandi-sanjay

కరీంనగర్ ఎంపీ, బీజేపీ నేత బండి సంజయ్ కి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సీఎం హోదాలో ఓ నోట్ విడుదల చేస్తూ.. “సంజయ్  నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించి, ప్రజలకి సేవలందించాలని ఆ భగవంతుణ్ని కోరుతున్నట్టు” కేసీఆర్ ఆ నోట్ లో తెలిపారు.

ఇందుకు సంజయ్.. “ విశాలమైన హృదయంతో తనకు శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్ పెద్ద మనస్సుకి వందనములు.” అని సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. “తనకు శుభాకాంక్షలు తెలిపిన సీఎంకు హృదయ పూర్వక ధన్యవాదాలు” అని ట్విటర్ లో పోస్ట్ చేశారు.

Latest Updates