నేను భయంకరమైన హిందువుని..ఎవ్వరికీ భయపడను

తాను భయంకరమైన హిందూవునన్నారు సీఎం కేసీఆర్. దేశంలో తాను చేసినన్ని యాగాలు ఎవరూ చయలేదన్నారు. తాను  లక్షల మందిని పిలిచి అన్నం పెట్టి యాగాలు చేశానన్నారు. తాను బాజప్త హిందూవనని ఎవరికీ భయపడేది లేదన్నారు.  సీఏఏతో దేశానికి నష్టమన్నారు. ఇదో పనికిమాలిన లొల్లి అన్నారు. ప్రపంచంతో కలిసి బతకాలన్నారు. మన వాళ్లు బయటి దేశాల్లో 10 కోట్ల మంది ఉన్నారని..వాళ్ల పరిస్థితి ఏంటన్నారు. ఎలాంటెలాంటి దుష్ట శక్తుల్ని తీసి పారేశామో మీకు తెలీదా అన్నారు. పొద్దున్న లేస్తే గాయత్రీ మంత్రం చదువుతానన్నారు. బీజేపీ వాళ్లు చెబితేనే చదువుతారా? అని ప్రశ్నించారు. దేశం మునిగి పోయే పరిస్థితి ఉంటే మౌనంగా ఉండకూడదన్నారు. త్వరలో ఎన్ఆర్ఐ బీజేపీ తప్పుడు నిర్ణయాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందన్నారు.