ఇది కరెక్ట్ కాదు.. సోషల్ మీడియాపై కేసీఆర్ ఆగ్రహం

సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు సీఎం కేసీఆర్. మున్సిపల్ రిజల్ట్స్ పై తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన కేసీఆర్.  సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా దూషిస్తే ఊరుకోబోమన్నారు. వ్యక్తిగత దూషణలు మంచిది కాదన్నారు. అది సోషల్ మీడియానా? లేక యాంటీ సోషల్ మీడియానా? అని ప్రశ్నించారు.  గవర్నమెంట్ ఎలా అనుమతిస్తుందన్నారు. తాము కూడా సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసే వారిపై  కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.  ఒకరైతే ముఖ్యమంత్రి ముక్కుకోస్తా అంటారు. జాతీయ పార్టీలో ఉంటూ అలాంటి విమర్శలు చేయడం కరెక్టేనా అని అన్నారు. సీఎంను దూషిండం కరెక్ట్ కాదన్నారు.

Latest Updates