ఈ ఎన్నికల్లో రూ.80 లక్షలే ఖర్చుపెట్టాం: కేసీఆర్

ప్రతిపక్షాలు ఇష్టానుసారంగా ఆరోపణలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్.  వేల కోట్లు ఖర్చుపెట్టామని వారెలా చెప్తారన్నారు. ప్రజలను అవమానపరచడం కరెక్ట్ కాదన్నారు.  మీరు గెలిచిన సీట్ల సంగతేంటన్నారు. స్థాయిని మించి మాట్లాడితే ప్రజలు ఊరుకోరన్నారు.  తాము పార్టీ మెటీరియల్ కోసం కేవలం రూ.80 లక్షలు మాత్రమే ఖర్చు చేసినట్లు చెప్పారు కేసీఆర్. ప్రతిపక్షాలు సద్విమర్శలు చేయాలి కానీ పనికిమాలిన ఆరోపణలు చేయవద్దన్నారు. ప్రతిపక్షాలు నిర్మాణాత్మకమైన పాత్ర పోషించాలన్నారు.ఇది ఒక పొలిటికల్ గేమ్ అని..తమకు మాత్రం ఒక టాస్క్ అని అన్నారు.