MIMకి భయపడే మేయర్ ఎన్నిక జరపడం లేదు

రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబ పాలన సాగుతోందన్నారు తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్.  బంగారు తెలంగాణ పేరుతో  కేసీఆర్ ఫ్యామిలీ రాష్ట్ర సంపద దోచుకుంటోందని ఆరోపించారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న తరుణ్ చుగ్, స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. మోడీ నాయకత్వంలో  దేశం సర్వ సంపన్న దేశంగా అభవృద్ధి చెందాలని స్వామివారిని కోరుకున్నానన్నారు. MIM పార్టీకి భయపడి సీఎం కేసీఆర్ హైదరాబాద్ మేయర్ ఎన్నిక జరపడం లేదన్నారు. కేటీఆర్ ను సీఎం చేయాలనుకుంటున్న కేసీఆర్ కు ధైర్యం ఉంటే.. అసెంబ్లీ రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు పోవాలని సవాల్ విసిరారు.

Latest Updates