కరోనాపై సీఎం ఎమర్జెన్సీ మీటింగ్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో కరోనా వైరస్‌‌ వ్యాప్తి చెందకుండా చేపట్టాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్​ గురువారం అత్యవసరంగా హైలెవల్ ​మీటింగ్ నిర్వహిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌‌లో జరిగే ఈ మీటింగ్‌‌లో పాల్గొనాలని కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలను ఆదేశించారు. బాధితుల నుంచి మరెవరికీ కరోనా వ్యాపించకుండా ఉండేందుకు చేపట్టాల్సిన చర్యలపై గురువారం నాటి సమావేశంలో చర్చించనున్నారు. ఇండోనేషియా నుంచి కరీంనగర్‌‌ కు వచ్చిన విదేశీయుల్లో కొందరికి కరోనా పాజిటివ్‌‌ తేలడంతో, రాష్ట్రవ్యాప్తంగా జనం అలర్ట్‌‌గా ఉండాలని సీఎం కేసీఆర్​ సూచించారు.

For More News..

కరోనా ఎఫెక్ట్: కరీంనగర్​లో మూడు కిలోమీటర్లు షట్​ డౌన్

కరోనాకు భయపడి కేసీఆర్ ఫాంహౌస్‌లో దాక్కున్నారు

Latest Updates