ముగిసిన డెడ్ లైన్: ఉన్నతాధికారులతో సీఎం సమావేశం

ఆర్టీసీ ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరేందుకు ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ విధించిన గడువు నిన్న అర్ధరాత్రితో ముగిసింది. అయితే ప్రభుత్వ డెడ్ లైన్ ను ఆర్టీసీ ఉద్యోగులు పట్టించుకోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 230 మంది కార్మికులు మాత్రమే విధుల్లో చేరినట్టు సమాచారం. ఇందులో భాగంగా ఆర్టీసీ సమ్మెపై సీఎం క్యాంప్ ఆఫీసులో రావాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ, రవాణాశాఖ ఉన్నతాధికారులతో కేసీఆర్ సమావేశమయ్యారు. సమ్మెపై  ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, హైకోర్టు ముందు ఉంచాల్సిన అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

 

Latest Updates