కంచికి కేసీఆర్ కుటుంబం.. ఎమ్మెల్యే రోజా విందు

కుటుంబ సమేతంగా తమిళనాడులోని కంచి పుణ్యక్షేత్రానికి వెళ్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ ఉదయం 8:40 కి బేగంపేట్ నుంచి హెలికాప్టర్ లో బయలుదేరారు సీఎం కేసీఆర్. ఆంధ్రప్రదేశ్ లోని రేణిగుంట విమానాశ్రయంలో.. చిత్తూరు జిల్లా వైసీపీ నేతలు కేసీఆర్ కు ఘనస్వాగతం ఏర్పాటుచేశారు.

రేణిగుంట నుంచి.. రోడ్డు మార్గంలో కంచికి వెళ్లనున్న సీఎం కేసీఆర్ కుటుంబం… దారిమధ్యలో నగరి ఎమ్మెల్యే రోజా ఇంట్లో కొద్దిసేపు ఆగుతారు. రోజా ఇంట్లో టీ తాగి… కేసీఆర్ ఫ్యామిలీ మళ్లీ కంచికి బయల్దేరి వెళ్తుంది.

కంచి కామాక్షి దేవాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొననున్నారు సీఎం కేసీఆర్. తిరుగుప్రయాణంలో నగరి ఎమ్మెల్యే రోజా ఇంట్లో భోజనం చేయనున్నారు. ఇదే రాత్రికి రేణిగుంట నుంచి హైదరాబాద్ కు చేరుకోనున్నారు సీఎం.

Latest Updates