కేసీఆర్ కుటుంబానికి రోజా ఆతిథ్యం

cm-kcr-family-to-have-lunch-at-ycp-mla-roja-residence

తెలంగాణ సీఎం కేసీఆర్ కు కుటుంబం ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా  నివాసానికి వెళ్లారు. అక్కడ వారు భోజనాలు చేశారు. రోజా స్వయంగా కేసీఆర్ కుటుంబ సభ్యలకు వడ్డించారు. భోజనానంతరం..వారు తిరుమలకు బయలుదేరి వెళ్లారు.

అంతకు ముందు తమిళనాడులోని కాంచీపురంలో అత్తివరదరాజస్వామి వారిని సీఎం కేసీఆర్‌ దంపతులు దర్శించుకున్నారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైదరాబాద్‌ నుంచి విమానంలో రేణిగుంటకు చేరుకుని అక్కడినుంచి రోడ్డుమార్గంలో వెళ్తున్న సీఎం కేసీఆర్‌కు నగరిలో రోజా స్వాగతం పలికారు. తర్వాత ఆమె కూడా సీఎం కుటుంబ సభ్యులతో కలిసి కాంచీపురానికి వెళ్లారు. తిరిగి తిరుమలేశుని దర్శించుకొనేందుకు తిరుమలకు వెళ్తూ… తన సతీమణి శోభ, కుమార్తె కవితతో కలిసి రోజా ఇంటికి  వెళ్లారు కేసీఆర్‌.

Latest Updates