కరోనాకు భయపడి కేసీఆర్ పారిపోతున్నారు: అర్వింద్

తెలంగాణాలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్. కరోనాపై  ప్రధాని నరేంద్ర మోడీ పోరాటం చేస్తుంటే.. సీఎం కేసీఆర్ మాత్రం పారిపోతున్నారని తెలిపారు. కరోనా కేసులపై ప్రజలకు అబద్దాలు చెబుతున్న కేసీఆర్..ప్రగతి భవన్ లో తినడం..ఫామ్ హౌస్ లో నిద్రపోవడం మాత్రమే చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైరస్ వ్యాప్తిపై  రివ్యూలు చేయడం లేదు..టెస్ట్ లు చేయించడం లేదన్న అర్వింద్..అసలు  రాష్ట్రంపై కేసీఆర్ కు పట్టింపే లేదన్నారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన సీఎం కేసీఆర్ మాస్క్ కూడా ధరించడం లేదని విమర్శించారు.

మరో వైపు మంత్రి ఆటల రాజేందర్ పై  ఆగ్రహం వ్యక్తం చేశారు అర్వింద్.  ఆయనకు కేంద్రంపై కామెంట్స్ చేసే హక్కు లేదన్నారు. ముందు ఆయన ఆరోగ్య శాఖ ను సరిగా చూసుకోమని సూచించారు. ఆస్పత్రుల్లో వసతులు లేవని బాధితులు వీడియోలు పెట్టి చనిపోతున్నారన్నారు. ఈటలకు… మంత్రిగా కొనసాగేందుకు నైతిక హక్కు కూడా లేదన్నారు. రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలంటూ డిమాండ్ చేశారు ఎంపీ అర్వింద్.

Latest Updates