తిరుమలకు బయల్దేరిన సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ కుటుంబసభ్యులతో కలిసి తిరుమల పర్యటనకు బయల్దేరారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆదివారం సాయంత్రం తిరుపతికి పయనమయ్యారు. కాసేపట్లో రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న కేసీఆర్.. రాత్రి అక్కడే బస చేసి సోమవారం ఉదయం శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకుంటారు. సోమవారం సాయంత్రం తిరుపతి నుంచి హైదరాబాద్‌కు చేరుకుంటారు కేసీఆర్‌.

Latest Updates