పాలిటిక్స్‌‌ అంటే అసహ్యం.. కేసీఆర్ మనవడు హిమాన్షు

  • రాజకీయాల్లోకి రాను.. పాలిటిక్స్‌‌ అంటే అసహ్యం
  • ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో నెటిజన్స్‌ తో కేసీఆర్ మనవడు హిమాన్షురావు ముచ్చట

హైదరాబాద్‌‌, వెలుగు: తనకు పాలిటిక్స్‌‌లోకి రావాలనే ఇంట్రస్ట్‌‌ లేదని, రాజకీయాలంటే అసహ్యమని సీఎం కేసీఆర్‌‌  మనవడు హిమాన్షు రావు చెప్పాడు. బుధవారం ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో ‘ఆస్క్‌‌ మి వాటెవర్‌‌ యూ ఫీల్‌‌ లైక్‌‌..’ అనే ట్యాగ్‌‌లైన్‌‌తో నెటిజన్స్‌‌తో ముచ్చటించాడు. ఈ సందర్భంగా నెటిజన్లతో పలు విషయాలను పంచుకున్నారు. నెక్ట్స్‌‌ సీఎంగా చూడాలని ఉందని ఓ నెటిజన్​ ప్రస్తావించగా.. ‘నాకు స్వేచ్ఛ అవసరం’ అని హిమాన్షు జవాబిచ్చాడు. ఫిబ్రవరి 20 తర్వాత కేటీఆర్‌‌  సీఎం అంటున్నారని, ఎంత వరకు నిజమని మరొకరు ప్రశ్నించగా.. ‘మా నాన్న, తాతయ్య ఇంట్లో ఉన్నప్పుడు పాలిటిక్స్‌‌ గురించి డిస్కస్‌‌ చేయరు. చిల్‌‌ అండ్‌‌ రిలాక్స్‌‌గా ఉంటారు’’ అని సమాధానమిచ్చాడు. కేటీఆర్‌‌ గురించి ఒక్క మాటలో చెప్పాలని ఓ నెటిజన్​అడగ్గా.. ‘కూల్‌‌’ అని రిప్లై ఇచ్చాడు. తాను టెన్త్​ కంప్లీట్​చేశానని, ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి కాలేజీకి వెళ్లడం ఇష్టమేనని చెప్పాడు. ఇటీవల క్రికెట్‌‌ హనుమ విహారి ప్రగతిభవన్​కు వచ్చినప్పుడు కలిశారా అని ఒకరు ప్రశ్నించగా.. ‘నేను ప్రగతిభవన్‌‌లో రెసిడెన్షియల్‌‌ పార్ట్‌‌ వరకే పరిమితం. అడ్మినిస్ట్రేటివ్‌‌ ఏరియాకు వెళ్లను’ అని చెప్పాడు.

For More News..

దేశంలో మోస్ట్ ఇన్నొవేటివ్ స్టేట్‌‌‌‌గా కర్నాటక.. నాలుగో ప్లేస్‌లో తెలంగాణ

గూగుల్ పేని దాటేసిన ఫోన్‌పే

Latest Updates