రైతుబంధు నిధులపై త్వరలో సీఎం కేసీఆర్ సమావేశం

హైదరాబాద్: రైతుబంధు నిధుల విడుదలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 7వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌‌లో జరిగే ఈ సమావేశంలో వ్యవసాయ, ఆర్థిక శాఖ అధికారులు పాల్గొననున్నారు. ఈ ఏడాది రెండో విడత రైతుబంధు సహాయం కోసం నిధుల విడుదల, పంపిణీపై ఈ మీటింగ్‌‌‌లో సమీక్షించి నిర్ణయం తీసుకోనున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వ్యవసాయ, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు.

Latest Updates