జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన  రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్ర ప్రజలను  ఉద్దేశించి  మాట్లాడుతూ… ఐదేళ్లలో  తెలంగాణ రాష్ట్రం  ఎంతో అభివృద్ధి  చెందిందన్నారు. ప్రణాళిక బద్దమైన  ఆలోచనలతో  ముందుకు  పోతున్నామన్న  సీఎం .. ఆర్థికంగా  తెలంగాణ బలమైన  శక్తిగా ఎదిగిందన్నారు.  కొత్త  పంచాయతీరాజ్, మున్సిపల్  చట్టాలు  తీసుకొచ్చామని  తెలిపారు. 60 రోజుల  ప్రణాళికతో గ్రామాల  రూపురేఖలు  మార్చబోతున్నామన్నారు  సీఎం.

వేడుకల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి, ఉన్నతాధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Latest Updates