యాదాద్రి స్తంభాలపై ఉన్న బొమ్మలను తొలగించండి: సీఎం ముఖ్య కార్యదర్శి

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ స్థంభాలపై రాజకీయనాయకుల బొమ్మలను తొలగించాల్సిందిగా సీఎం ముఖ్య కార్యదర్శి భూపాల్ రెడ్డి అధికారులను ఆధేశించారు. గుడి స్థంబాలపై ఉన్న పలు రాజకీయ నాయకుల బొమ్మలు ఉండటం పట్ల ఆయన శిల్పులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. YTDA స్పెషల్ ఆఫీసర్ కిషన్ రావు, ఆర్ట్ డైరెక్టర్ ఆనంత్ సాయి టీంను ప్రగతి భవన్ కు పిలిపించుకుని మాట్లాడిన భూపాల్ రెడ్డి.. పార్టీల గుర్తులను, రాజకీయ నాయకుల చిహ్నాలను ఎవరినడిగి చెక్కారని ప్రశ్నించారు. అయితే శిల్పుల ఇష్టప్రకారమే చెక్కారని తామెవరికి రాజకీయనాయకుల బొమ్మలు చెక్కేందుకు అనుమతి నివ్వలేదని చెప్పారు కిషన్ రావు, ఆనంద్ సాయి.

ఆలయంలో చెక్కిన రాజకీయనాయకుల, పార్టీల బొమ్మలను తక్షణమే తొలగించాలని ఆర్డర్ వేశారు భూపాల్ రెడ్డి. ఇలాంటి పనులు సీఎం కేసీఆర్ కు కూడా ఇష్టముండదని తెలిపారు. దేవతల బొమ్మలు తప్ప మరెవరి బొమ్మలు గుడిపై ఉండకూడదని చెప్పారు. దీంతో ఆలయంలో చెక్కిన కేసీఆర్, కారుగుర్తు, రాష్ట్ర పథకాల గుర్తులు, కాంగ్రెస్ నాయకుల గుర్తులను తొలగించేందుకు రెడీ అయ్యారు అధికారులు.

Latest Updates