ధరణి దేశంలోనే ట్రెండ్ సెట్టర్.. పావుగంటలోనే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్

ధరణి పోర్టల్ దేశానికే ట్రెండ్ సెట్టర్ అని అన్నారు సీఎం కేసీఆర్. మేడ్చల్  జిల్లాలోని మూడు చింతలపల్లిలో ధరణి పోర్టల్ ను ప్రారంభించారు కేసీఆర్. మూడు చింతల పల్లికి  ప్రత్యేక గౌరవం దక్కిందన్నారు . ఇక నుంచి ధరణి పోర్టల్ ద్వారానే భూక్రయవిక్రయాలు జరుగుతాయన్నారు. అంతేగాకుండా ఏకకాలంలో రిజిస్ట్రేషన్లు,మ్యూటేషన్లు జరుగుతాయన్నారు. ఇవాళ్టి నుంచే స్లాట్ బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. నవంబర్ 2 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయన్నారు. తనకు ఐదేళ్ల కిందటే ధరణి ఆలోచన వచ్చిందన్నారు. భూమి కేవలం ఒక ఉత్పత్తి సాధనంగా  ఉండేదన్నారు. తప్పులు చేసే అధికారం తనకు కూడా లేదన్నారు..

తెలంగాణలో కోటి 45 లక్షల 58 వేల ఎకరాల భూములు ఇవాళ ధరణి వెబ్ సౌట్ లో ఉన్నాయన్నారు. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ధరణి వెబ్ సైట్ ఓపెన్ చేసి భూముల వివరాలు చూసుకోవచ్చన్నారు.  ఎట్టి పరిస్థితుల్లో ధరణిలో అక్రమ రిజిస్ట్రేషన్లు జరగబోవన్నారు. భూముల  గోల్ మాల్ సంగతే ఉండదన్నారు. వక్ఫ్,ఎండోమెంట్,ఇతర భూముల కబ్జాలుండవన్నారు. రిజిస్ట్రేషన్లకు పైరవీలు అవసరం లేదన్నారు. కొత్తగా 570 జాయింట్ సబ్ రిజస్ట్రార్ ఆఫీసులుగా పనిచేస్తాయన్నారు. పావుగంటలోనే రిజిస్ట్రేషన్ ,మ్యుటేషన్ పూర్తవుతుందన్నారు. ఆఫీసుల చుట్టు తిరిగే పనిలేదన్నారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచలేదని..పాతవే ఉన్నాయన్నారు.

భూ సమస్య రైతులకు తలనొప్పిగా మారిందన్నారు. వీఆర్వోలు, ఇతర సమస్యలతో రెవెన్యూ శాఖకు చెడ్డపేరు వచ్చిందన్నారు. గొప్ప సంస్కరణలు వచ్చినపుడు కొన్ని సమస్యలు వస్తాయన్నారు. ధరణి పూర్తి పారదర్శకంగా ఉందన్నారు. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ టాప్ లోఉందన్నారు. రూ. 26 వేల కోట్లతో రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామన్నారు. తెలంగాణ నుంచే 55 శాతం వడ్లు సరఫరా చేశామన్నారు.

చాలా మంది ఉన్నతాధికారులు ఈ ధరణి పోర్టల్ సాధ్యం అవుతుందా అని అనుకున్నారు కానీ సాధ్యం చేసి చూపించామన్నారు.  కరోనా రాకపోతే 6 నెలల ముందే ధరణి పోర్టల్ వచ్చేదన్నారు. ఎలాంటి పంచాయతీలు లేకుండా ధరణి లో భూముల రికార్డులు నమోదు చేసామన్నారు. రైతులు స్లాట్  బుక్ చేసుకుని భూమి అమ్ముకోవచ్చు.. కొనుక్కోవచ్చాన్నారు.   భూమి అమ్మిన కొనుగోలు చేసిన కొద్ది గంటలలొనే ధరణి లొనే అప్డేట్ అవుతుందన్నారు. అసలు భూమి లేని వారు భూములు కొనుగోలు చేస్తే వారికి కొంత డబ్బులు చెల్లిస్తే కొత్త పాసు పుస్తకం ప్రభుత్వం ఇస్తుందన్నారు. జిల్లాకు ఒక టెక్నీకల్ టీమ్ ను ఏర్పాటు చేసామని..వారు ఏదయినా సమస్య వస్తే పరిష్కారం చేస్తారన్నారు. 3 సంవత్సరాలు కష్ట ఫలితం ధరణి పోర్టల్ అని అన్నారు.

Latest Updates