గ‌వ‌ర్న‌ర్ తో ముగిసిన సీఎం కేసీఆర్ భేటీ

హైద‌రాబాద్: రాజ్ భ‌వ‌న్ లో బుధ‌వారం గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసైతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. దాదాపు గంట‌న్న‌ర పాటు వీరి మ‌ధ్య స‌మావేశం కొన‌సాగ‌గా..క‌రోనా వైర‌స్ నివార‌ణ కోసం ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌లు, లాక్ డౌన్‌ అమలు, పేదలకు రేషన్‌ బియ్యం పంపిణీ, నగదు పంపిణీ, ఇతర పరిస్థితులను గవర్నర్ కు వివరించారు సీఎం.

ఢిల్లీ మ‌ర్క‌జ్ నుంచి రాష్ట్రానికి వ‌చ్చిన వారి వివ‌రాల‌పై గ‌వ‌ర్న‌ర్ ఆరా తీసిన‌ట్లు స‌మాచారం. ఈ సమావేశంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, హెల్త్‌ చీఫ్‌ సెక్రటరీ శాంతికుమారి, డీజీపీ మహేందర్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Latest Updates