డీఎంకే చీఫ్ స్టాలిన్ తో కేసీఆర్ భేటీ

Cm KCr Meets Stalin in chennai

డీఎంకే చీఫ్ స్టాలిన్ తో సమావేశమయ్యారు ముఖ్యమంత్రి కేసీఆర్. నిన్న తమిళనాడు వెళ్లిన కేసీఆర్.. ఇవాళ స్టాలిన్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. తమ నివాసానికి వచ్చిన కేసీఆర్ కు స్టాలిన్ తో పాటు.. ఆయన సోదరుడు అళగిరి సాదర స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి వెంట ఎంపీలు వినోద్, సంతోష్ కూడా ఉన్నారు.

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై మొదటి విడతలో ఓసారి స్టాలిన్ తో భేటీ అయిన కేసీఆర్.. సార్వత్రిక ఎన్నికలు ముగుస్తున్న సమయంలో.. మరోసారి రాష్ట్రాల పర్యటనలు చేస్తున్నారు. రెండోవిడత పర్యటనలో భాగంగా ఇప్పుడు డీఎంకే చీఫ్ స్టాలిన్ తో రెండోసారి సమావేశమై చర్చిస్తున్నారు. ముఖ్యంగా లోక్ సభ ఎన్నికలు, తర్వాతి పరిణామాలపై ఇద్దరు నేతలు చర్చించిస్తున్నట్లు సమాచారం. దేశానికి బీజేపీ, కాంగ్రెసేతర కూటమి అవసరమని కొన్ని రోజులుగా చెబుతూవస్తున్నారు సీఎం కేసీఆర్. అదే విషయంపై ప్రాంతీయ పార్టీల నేతలతో చర్చలు జరుపుతున్నారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలు నిర్వహించాల్సిన పాత్రపై స్టాలిన్ తో కేసీఆర్ చర్చిస్తున్నట్లు సమాచారం.

ఇవాళ స్టాలిన్ తో భేటీ అయిన కేసీఆర్… ఆ తర్వాత కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామితో కూడా సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. వారంరోజుల క్రితం కర్ణాటక సీఎం కుమారస్వామి.. కేసీఆర్ కు ఫోన్ చేసి మాట్లాడినట్లు ఇప్పటికే సీఎంఓ ప్రకటించింది. ఇద్దరు నేతలు భేటీ కావాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. లోక్ సభ ఎన్నికల ఫలితాలు దగ్గర పడుతున్న సమయంలో ప్రాంతీయ పార్టీల అధినేతలతో కేసీఆర్ భేటీలకు ప్రాధాన్యత ఏర్పడింది.

Latest Updates