ఇరుకుల్ల వాగుకు సీఎం కేసీఆర్ పేరు

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ రూరల్ మండలం ఇరుకుల్ల సమీపంలోని వాగుకు సీఎం కేసీఆర్ పేరిట మంత్రి గంగుల కమలాకర్ ‘కేసీఆర్ వాగు’ అని పేరు పెట్టారు. ఈ వాగుకు ప్రత్యేకంగా పేరేం లేదు. గతంలో గుండి నుంచి నీళ్లు వచ్చే టైంలో గుండి  వాగు అని, కొత్తపల్లి నుంచి నీళ్లొస్తున్నప్పుడు కొత్తపల్లి వాగు అని పిలిచేటోళ్లు. ఈ మధ్య దీనిని ఇరుకుల్ల వాగు అని అంటున్నారు. శుక్రవారం దుర్శేడ్ పీఏసీఎస్ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి వెళ్లిన మంత్రి గంగుల దీనికి కేసీఆర్ వాగుగా పేరు పెట్టారు. వాగు మీద నాలుగైదు చెక్ డ్యామ్ లు నిర్మిస్తున్నామని, వాగులోకి నీళ్లు తెచ్చేది కేసీఆర్ కాబట్టి.. దీనికి కేసీఆర్ వాగు అని పేరు పెడ్తున్నామని తెలిపారు.

Latest Updates