అడవులు కబ్జా కావొద్దు.. మంత్రులు, అధికారులకు సీఎం ఓపెన్ క్లాస్

అడవుల కబ్జాపై ఉక్కుపాదం మోపాలని మంత్రులు, అధికారులకు క్లాస్ తీసుకున్నారు సీఎం కేసీఆర్. కలెక్టర్లతో సమావేశాల్లో భాగంగా… ఇవాళ రెండోరోజు ఉదయం హైదరాబాద్ సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి… మంత్రులు, అధికారులు, కలెక్టర్లతో కలిసి గజ్వేల్ లోని కోమటిబండకు వెళ్లారు సీఎం కేసీఆర్.

మార్గమధ్యలో.. సింగాయిపల్లి ఫారెస్ట్ బ్లాక్ లో ఆగారు. అక్కడ అడవుల పరిరక్షణ… ఆక్రమణలపై అధికారులతో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఆక్రమణలు అడ్డుకునేందుకు చర్యలు ఏం తీసుకుంటున్నారని ప్రశ్నించారు. అందుకు వన సంరక్షణపై ప్రచారం , అవగాహన కార్యక్రమాలు చేస్తున్నామని అధికారులు, మంత్రులు వివరణ ఇచ్చారు. ఐతే… దీనిపై సీఎం కేసీఆర్ ఒకింత సీరియస్ గా స్పందించారు. “ఇది నా నియోజకవర్గం. ఇక్కడేం జరుగుతుందో చూస్తూనే ఉన్నా. 15రోజులకు ఒకసారి వస్తూ పోతూ చూస్తునే ఉన్నా. ఇక్కడేం జరుగుతుందో నాకూ తెలుసు. అడవులు, అటవీ భూములు కబ్జా కాకుండా చూడటం, వాటి సరిహద్దులు గుర్తించడం చాలా ముఖ్యం. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కూడా ఈ పని చేయాలి” అని కేసీఆర్ చెప్పారు.

Latest Updates