ఎమ్మెల్యే రామలింగారెడ్డి భౌతికకాయానికి సీఎం కేసీఆర్ నివాళి

సిద్దిపేట : సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భౌతికకాయానికి పూల మాల వేసి నివాళ్లు అర్పించారు సీఎం కేసీఆర్. గత కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఎమ్మెల్యే రామ‌లింగారెడ్డి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధ‌వారం ఉద‌యం మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. విష‌యం తెలుసుకున్న సీఎం జిల్లాలోని దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామానికి చేరుకొని ఎమ్మెల్యే భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఉద్యమ సహచరుడిగా, ఒకే ప్రాంత వాసిగా సోలిపేటతో ఎంతో అనుబంధం ఉందని సీఎం గుర్తు చేసుకొని సీఎం కన్నీటి పర్యంతమైయ్యారు. సోలిపేట కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారి కుటుంబానికి అన్ని వేళలా అండగా ఉంటామన్నారు.

 

Latest Updates