సాహితీవేత్త రామ చంద్రమౌళికి  కాళోజీ సాహిత్య అవార్డు

ప్రముఖ సాహితీవేత్త రామ చంద్రమౌళికి సీఎం కేసీఆర్ బుధవారం ప్రగతి భవన్ లో కాళోజీ సాహిత్య పురస్కారం ప్రదానం చేశారు. కాళోజీ అవార్డుకు  రామ చంద్రమౌళికి సంపూర్ణ అర్హులన్నారు. అవార్డు కింద లక్షా 1,116 నగదును అందించి… శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస గౌడ్, ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, డైరెక్టర్ మామిడి హరికృష్ణ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Latest Updates