100 కోట్లతో ఎర్రమంజిల్ లో అసెంబ్లీ నిర్మిస్తాం

తెలంగాణ కేబినేట్ సమావేశాల అనంతరం సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ఇరుగు పొరుగు రాష్ట్రాలతో వ్యవహరించాల్సిన స్నేహపూర్వక సంబంధాలపై చర్చ జరిగిందని.. ఎలాంటి భేషజాలకు పోకుండా రెండు తెలుగు రాష్ట్రాలూ ఒకరికొకరు పూర్తి సహాయ సహాకారాలు అందిపుచ్చుకోవాలని నిర్ణయించామన్నారు.

గత కాంగ్రెస్ ప్రభుత్వాల పాలన పక్కరాష్ట్రాలతో అనేక వివాదాలుండేవని, తెలంగాణ వచ్చిన తర్వాత పక్క రాష్ట్రమైన కర్ణాటక, మధ్యప్రదేశ్ లతో సత్ససంబంధాలు కొనసాగిస్తున్నామని ఆయన అన్నారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ఆ రెండు రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించినట్టు కేసీఆర్  తెలిపారు.

రాష్ట్రంలో కొత్త సెక్రటేరియట్, కొత్త అసెంబ్లీ భవనాలు నిర్మించాలని నిర్ణయించినట్టు కేసీఆర్ తెలిపారు. ఎర్రమంజిల్ లో 17 ఎకరాల స్థలంలో రూ. 100 కోట్లతో పార్లమెంట్ మోడల్లో అసెంబ్లీని నిర్మిస్తామని సీఎం అన్నారు. ఫ్రంట్ ఎలివేషన్ మాత్రం ఇప్పడున్న అసెంబ్లీ మోడల్లోనే నిర్మిస్తామని,  ఇప్పుడున్న అసెంబ్లీ వారసత్వాన్ని కాపాడతామని అన్నారు. సెక్రటేరియట్ ను మాత్రం ఉన్నచోటే నిర్మిస్తామని, రూ. 400 కోట్లతో చౌకగా అయిపోతుందని అన్నారు. ఈ నెల 27న ఇందుకు సంబంధించి భూమిపూజ ఉంటుందని ఆయన అన్నారు. దసరా వరకు మంచిరోజులు లేకపోవడంతో.. ఈ నెలలోనే భూమిపూజ జరుగుతుందని అన్నారు.

Latest Updates