రైతులు ఆందోళన వద్దు మొత్తం పంట మేమే కొంటాం

హైదరాబాద్:  రైతులు దిగులు చెందాల్సి అవసరంలేదని వరిపంటను మద్దతు ధరకే కొంటామని తెలిపారు సీఎం కేసీఆర్. కరోనా కట్టడి చర్యలు, లాక్‌ డౌన్‌ పరిస్థితులపై మంగళవారం సీఎం సమీక్ష నిర్వహించారు. తర్వాత మీడియాతో మాట్లాడిన కేసీఆర్.. ప్రతి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. మార్కెట్ యార్డులకు రైతులు రావద్దన్న సీఎం.. మొక్కజొన్న పంటను కూడా కొంటామన్నారు.

గ్రామాలు చాలా వరకు నియంత్రణలో ఉన్నాయని.. రైతులు వ్యవసాయం చేసుకోవచ్చని సూచించిన కేసీఆర్.. రైతులు కూడా సోషల్ డిస్టెన్స్ పాటించాలన్నారు. దేశానికి అన్నం పెట్టేది అన్నదాతనే కాబట్టి వ్యవసాయం చేయక తప్పదన్నారు.  చాలా గ్రామాలు కంచెలు వేసుకున్నాయని.. గ్రామ పంచాయతీలలో ఉన్న స్టాండింగ్‌ కమిటీ సభ్యులంతా రంగంలోకి దిగాలన్నారు సీఎం కేసీఆర్.

 

 

Latest Updates