సీఎం కేసీఆర్ ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనలో ఉన్నారు. బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి సతీసమేతంగా కాళేశ్వరం బయలుదేరి వెళ్లారు. ఆయనకు ఆలయాధికారులు ఘన స్వాగతం పలికారు. కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంలో కేసీఆర్ పూజలు నిర్వహించారు. కేసీఆర్ దంపతులు స్వామివారికి అభిషేకం చేశారు.
అనంతరం ఆయన హెలికాప్టర్లో మేడిగడ్డ బ్యారేజీకి చేరుకుంటారు. మేడిగడ్డ బ్యారేజీలో పూర్తిస్థాయి నీటి నిల్వ ఉండటంతో బ్యారేజీని పరిశీలించనున్నారు. బ్యారేజీ, నిల్వ ఉన్న నీటిని ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించి.. అక్కడే అధికారులు, ఇంజనీర్లతో సమీక్షిస్తారు. సీఎం పర్యటన సందర్భంగా జిల్లాలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
For More News..