తక్షణ సాయం రూ. 1,350 కోట్లు కావాలి : కేంద్రాన్ని కోరిన కేసీఆర్

హైదరాబాద్: నిర్ణీత పంటల సాగుపై గురువారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం.. భారీ వర్షాలు.. వరదలతో రాష్ట్రంలో రూ. 5వేల కోట్లు నష్టం వాటిల్లిందన్నారు. తక్షణ సహాయ, పునరావాస చర్యలకు రూ. 13వందల 50కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. దీనిపై ప్రధాని మోడీకి లెటర్ రాసిన సీఎం కేసీఆర్.. పంట నష్టపోయిన వారిని, వరద బాధితుల్ని ఆదుకునేందుకు సాయం చేయాలని విన్నవించారు. 2020-21 యాసంగి సీజన్ లో 50 లక్షల ఎకరాల్లో వరిపంట, మరో15 లక్షల ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేసే విధంగా నిర్ణీత పంటల సాగు విధానం ఖరారైందన్నారు సీఎం కేసీఆర్.

Latest Updates