ఆర్టీసీ సమ్మె ప్రభావం పై సీఎం కేసీఆర్ ఆరా

మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లతో క్యాంప్ ఆఫీసులో సీఎం కేసీఆర్ సమావేశం కొనసాగుతోంది. గ్రామాల అభివృద్ధికి చేపట్టిన 30 రోజుల ప్రణాళిక అమలు తీరును తెలుసుకుంటున్నారు. హరితహారం,  పారిశుద్ధ్య పనులు,  గుంతలు పూడ్చడం,  శ్మశానవాటికల నిర్మాణం,  స్టాండింగ్ కమిటీల ఏర్పాటు,  దోమల నివారణ వంటి పనులపై చర్చిస్తున్నారు సీఎం. గ్రామాల అభివృద్ధితో పాటు  భవిష్యత్తులో చేయాల్సిన పనులపై కలెక్టర్లకు దిశానిర్ధేశం చేయనున్నారు. కలెక్టర్ల మీటింగ్ కు డీపీవో, డీఎల్పీవోలనూ ఆహ్వానించారు. మీటింగ్ కోసం కలెక్టర్లు హైదరాబాద్ రావడంతో జిల్లాల్లో కలెక్టర్ల బాధ్యతలు జేసీలు, డీఆర్వోలు నిర్వర్తించాలని సీఎస్ ఎస్ కే జోషి ఆదేశాలు జారీ చేశారు.

ఆర్టీసీ సమ్మె ప్రభావం, తీసుకుంటున్న ప్రత్యామ్నాయ చర్యలను కలెక్టర్లను అడిగి తెలుసుకోనున్నారు కేసీఆర్. అన్ని బస్ డిపోల ముందు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఇప్పటికే పోలీసులను ఆదేశించారు. దసరా సెలవులు ముగిసిన తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై సీఎం అధికారులకు సూచనలు చేయనున్నట్లు తెలుస్తోంది.

Latest Updates