ఇంటర్ ఫలితాలపై సీఎం రివ్యూ : మంత్రితో భేటీ

హైదరాబాద్ : ఇంటర్ ఫలితాల గందరగోళంపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టిపెట్టారు. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి హాజరయ్యారు. విద్యా శాఖ కార్యదర్శి బి. జనార్ధన్ రెడ్డి, ఇంటర్ బోర్డ్ కార్యదర్శి అశోక్ మీటింగ్ కు వచ్చారు.

2019 ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలపై రాష్ట్రంలో తీవ్రదుమారం రేగుతోంది. తప్పులు జరిగాయని.. రాష్ట్ర విద్యాశాఖ… పొరపాట్లు జరిగింది వాస్తవమే అని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించాయి. అందరు విద్యార్థులకు న్యాయం చేస్తామని ప్రభుత్వం, అధికారులు హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటుచేసింది. అటు విద్యాశాఖ కూడా విచారణ జరిపిస్తోంది. ఒకట్రెండు రోజుల్లోనే త్రిసభ్య కమిటీ రిపోర్ట్ ప్రభుత్వానికి అందనుంది.

మరోవైపు.. విద్యార్థులు, తల్లిందండ్రుల్లో ఆందోళన తగ్గలేదు. పలు టెక్నికల్ సమస్యలతో ఇష్యూ పెద్దదవుతోంది. రాజకీయపార్టీలు కూడా నిరసన గళం పెంచాయి. ఈ పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు.

Latest Updates