ఆర్టీసీ సమ్మె- హైకోర్టు ఆదేశాలపై సీఎం రివ్యూ

ఆర్టీసీ సమ్మె విషయంలో హైకోర్టు ఆదేశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ రివ్యూ చేశారు.  హైదరాబాద్ లోని క్యాంప్ ఆఫీస్ లో రాష్ట్ర రవాణా శాఖమంత్రి పువ్వాడ అజయ్, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, ఇతర అధికారులతో సమావేశం అయ్యారు. రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు, తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై సీఎం సమీక్ష జరిపారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని.. సమ్మె విరమింపచేయాలని మంగళవారం నాడు హైకోర్టు ప్రభుత్వాన్ని సూచించడంపై అధికారులతో మాట్లాడారు. ఆల్టర్ నేట్ యాక్షన్ ప్లాన్ పై చర్చించారు. మరోవైపు.. ఆర్టీసీకి ఎండీ నియామకంపైనా ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.

Latest Updates