ఫ్రీగా బియ్యంతో పాటు రూ.1500

తెల్లరేషన్‌ కార్డుదారులందరికీ ప్రతీ ఇంట్లో ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున నెలకు సరిపడా బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. బియ్యంతోపాటు ఇతర సరుకుల కొనుగోలు కోసం రూ.1500 నగదు అందజేస్తమన్నారు. 87.59 లక్షల మందికి తెల్లరేషన్ కార్డులు ఉన్నాయని.. ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం చొప్పున ఫ్రీగా అందిస్తామన్నారు. బియ్యంతోపాటు ఇతర సరుకుల కొనుగోలు కోసం రూ.1500 నగదు అందజేస్తామని చెప్పారు. రూ.2417 కోట్లు ఇందుకోసం తక్షణం రిలీజ్ చేస్తున్నామన్నారు.

వాళ్లకు వీలైనంత త్వరగా అందిస్తాం. ప్రభుత్వ కార్యాలయాలకు అందరూ రావాల్సిన పని లేదన్నారు. అత్యవసర సేవల ఉద్యోగులు రావాలని.. 20 శాతం ఉద్యోగులు రొటేషన్‌లో పని చేస్తారన్నారు. మళ్లీ రివ్యూ చేసి నిర్ణయం తీసుకుంటామని.. ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు, ప్రైవేటు ఎంప్లాయిస్, కార్మికులకు అందరికీ ఈ వారానికి విధిగా జీతం ఇవ్వాల్సిందేనన్నారు. కచ్చితంగా ప్రభుత్వ ఆదేశాలను చెల్లించాలని.. ప్రజలను ఆదుకోవాలన్నారు. అంబులెన్స్‌లు ఉంటాయని.. అంగన్వాడీల్లో జనం గుమ్మిగూడితే సమస్య వస్తుంది అందుకే మూసేస్తున్నామన్నారు. అక్కడి నుంచి మహిళలు, పిల్లలకు పౌష్టికాహారం ఇంటికే అందించాలని తెలిపారు.

Latest Updates