ఏమైత‌దిలే అనే నిర్ల‌క్ష్యం ప‌నికిరాదు

స్వీయ నియంత్ర‌ణే శ్రీ‌రామ ర‌క్ష అని ..ప్ర‌జ‌లు ఏమైత‌దిలే అనే నిర్ల‌క్ష్యం ప‌నికిరాదన్నారు సీఎం కేసీఆర్. లాక్ డౌన్ పై శుక్ర‌వారం సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ లో మాట్లాడారు. క‌రోనా వైర‌స్ పై ధైర్యం కోల్పోలేదని..పూర్తిగా సిద్ధంగా ఉన్నామ‌న్నారు. ప్ర‌ధాని మోడీతో ఈ ఉద‌యం కూడా మాట్లాడాన‌ని.. దేశం మీతో ఉంద‌ని మోడీ హామీ ఇచ్చారన్నారు. ప్ర‌పంచ‌మంతా ఈ జ‌బ్బు బారిన‌ప‌డిన వాళ్ల‌కు ట్రీట్మెంట్ ఇచ్చే ప‌ద్ద‌తి 80 శాతం మైల్డ్, 13.8 ఐసోలేష‌న్ వార్డులు.. 4.7 క్రిటిక‌ల్ కేర్ ఉంటుంద‌న్నారు. దీనికి మ‌నం సన్న‌ద్ధంగా ఉండాలన్నారు. ఆరోగ్య ఇంకొక‌రి మీద ఆధార‌ప‌డ‌కుండా ఎంత వ‌ర‌కు దీన్ని ఎదుర్కోగ‌లం అన్న దానిపై గురువారం స‌మావేశ‌మై చ‌ర్చించామ‌ని తెలిపారు సీఎం కేసీఆర్. 100 మంది అవ‌స‌రం ఉంటే మ‌రో 30 ఎక్కువ‌గా సిద్ధంగా పెట్టుకోవాలని నిర్ణ‌యించామ‌న్నారు. సిద్ధంగా ఉన్నామ‌ని డాక్ట‌ర్లు, న‌ర్సులు, ఒక్కొక్క ద‌శ‌లో 4 వేల మంది ఐసోలేష‌న్ ఐసోలేష‌న్ వార్డుల్లో ..1400 క్రిటిక‌ల్ కేర్ బెడ్స్ రెడీగా ఉన్నాయ‌న్నారు.

ఇందుకోసం గ‌చ్చిబౌలి స్టేడియంలో సిద్ధం చేస్తున్నారని తెలిపారు. గాంధీలో నూ కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. 500 వెంటిలేట‌ర్లకు ఆర్డ‌ర్ వ‌స్తున్నాయని.. 11 వేల మంది 1400 మంది క్రిటిక‌ల్ కేర్ ..80 శాతం మైల్డ్, 60 వేల మంది ఎఫెక్ట్ అయినా చేసేందుకు సిద్ధంగా ఉన్నామ‌న్నారు. 11 వేల మంది ఎంబీబీఎస్ పాస్ అయిన డాక్టర్లు, రిటైర్డ్ డాక్ట‌ర్లు ఎంత‌మంది ఉన్నార‌న్న‌ది సిద్ధం చేస్తున్నామ‌ని తెలిపారు సీఎం కేసీఆర్. 3 వేల మంది పీజీ విద్యార్థులను అవ‌స‌రాన్ని బ‌ట్టి వాడుకుంటామ‌ని.. న‌ర్సులు, పారామెడిక‌ల్, వ్యాధి విజృభించినా చికిత్స అందిచేందుకు సిద్ధంగా ఉన్నామ‌న్నారు. ప్ర‌భుత్వం చేసేది చేస్తోంది.. ప్ర‌జ‌లు నిర్ల‌క్ష్యంగా ఉండొద్దన్నారు. ప్ర‌భుత్వానికి, పోలీసులు, వైద్య సిబ్బందికి స‌హ‌క‌రించాల‌న్నారు సీఎం కేసీఆర్.

రాత్రిప‌గ‌లు లేకుండా ప‌ని చేస్తున్నామ‌ని.. ఇదొక‌ యుద్ధం లాంటిది.. విప‌త్తు స‌మ‌యంలో స్వీయ నియంత్ర‌ణే శ్రీరామ ర‌క్ష‌.. దీనిలో అంద‌రూ స‌హ‌క‌రించాలన్నారు. పాలు, నిత్యావ‌స‌రాలు, కూర‌గాయ‌లు లోటు లేకుండా చేస్తున్నామ‌న్న సీఎం కేసీఆర్.. తెలంగాణ బిడ్డ‌గా చేతులెత్తి న‌మ‌స్క‌రించి చెబుతున్నాన‌న్నారు.

Latest Updates