పీవీ గురించి మాట్లాడాలంటే ధైర్యం కావాలి

మాజీ ప్రధాని, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహరావు 99వ జయంతి సందర్భంగా పీవీ ఘాట్ లో ఘనంగా ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. పీవీ జయంతి సందర్భంగా .. సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. పీవీ గురించి మాట్లాడాలంటే సాహసం కావాలని ఆయన అన్నారు. పీవీ మన ఠీవీ అని ఆయన అన్నారు. పీవీ ఒక గొప్ప సంస్కరణ శీలి అని సీఎం కొనియాడారు. పీవీ 99వ జయంతి ఉత్సవాలను నేడు ప్రారంభించి.. వచ్చే ఏడాది మళ్లీ ఇదే రోజు వరకు చేసి.. ఆరోజున 100వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు.

‘పీవీ నరసింహారావు 360 డిగ్రీలు కలిగిన వ్యక్తి. నిరంతర సంస్కరణ శైలి పీవీ నరసింహారావు. ఆయన పనిచేసిన ప్రతి దగ్గర సంస్కరణలు చేశారు. డీజీపీ లాంటి వాళ్లు సర్వైల్ లో చదువుకున్నారు. ఆ పాఠశాల పీవీ గారు ఏర్పాటు చేసిందే. నవోదయ పాఠశాలలు తీసుకొచ్చింది కూడా ఆయనే. అలాంటి మహనీయుని శత జయంతి ఉత్సవాలు చాలా అవసరం. తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు ప్రపంచానికి స్ఫూర్తిగా నిలపడ్డారు. ముఖ్యమంత్రిగా ఎన్నో భూ సంస్కరణలు తీసుకువచ్చారు. తనకున్న 1200 ఎకరాలలో 800 ఎకరాలు పేదలకు పంచిపెట్టారు. పీవీ మన ఠీవీ. ఎన్ని విమర్శలు వచ్చిన తాను నమ్మిన సిద్ధాంతాలను పాటించాడు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని గొల్ల ఎల్లమ్మ కథలు రాశారు. ఈ రోజు రాష్ట్రంలో 95 శాతం చిన్న కమతాలు కలిగిన రైతులు ఉన్నారు అంటే దానికి కారణం పీవీ నరసింహారావు. ఈ రోజు మనం ఆర్ధిక స్వేచ్ఛలో ఉన్నామంటే దానికి కూడా కారణం పీవీ నరసింహారావు. పీవీ నరసింహారావు అంతటి మహనీయుడికి దక్కాల్సిన గౌరవం దక్కలేదు. ఎందుకు దక్కలేదో నేను ఒక సందర్భంలో చెపుతాను. ఆయన ముఠాలు కట్టే వ్యక్తి కాదు. డబ్బు ఉన్న వ్యక్తి కాదు. ఆయన తన తెలివితో ప్రధానమంత్రి, సీఎం, కేంద్రమంత్రి అయ్యాడు. పీవీ గొప్ప బహుభాషా కోవిదుడు. కంప్యూటర్ కూడా స్వయంగా ఆపరేట్ చేసేవాడు. విద్యాశాఖను హెచ్ఆర్డీ గా మార్చింది కూడా పీవీ గారే. వ్యక్తిత్వ నిర్మాణానికి పీవీ ప్రతికగా నిలిచారు.ఆయన ఆశయ సాధన మనందరి బాధ్యత. సంస్కరణలు ఎల్లప్పుడూ కొనసాగుతునే ఉండాలి. మార్పులు ఎవరైనా ఎందుకు అంగీకరించరు. రాష్ట్రంలో 900 గురుకులాలు పీవీ నరసింహారావు ఆశయం కోసం ఏర్పాటు చేశాం. వెయ్యి పడగలు నవలను హిందీలోకి చాలా చక్కగా తర్జుమా చేశారు’ అని సీఎం కేసీఆర్ అన్నారు.

For More News..

మాజీ ప్రధాని పీవీకి నివాళులర్పించిన సీఎం కేసీఆర్

బతికున్న శిశువును చనిపోయాడని కవర్లో చుట్టిన ఆస్పత్రి సిబ్బంది

కోట్ల రూపాయల వద్దనుకుంటున్న సెలబ్రిటీలు

మా ప్రాణం తీసెయ్యండి.. వృద్ధ దంపతుల వేడుకోలు

Latest Updates