‘అన్ని పైసలు ఏం చేసుకుంటరు?’: రెవిన్యూ శాఖపై సీఎం వ్యాఖ్యలు

మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ శనివారం సాయంత్రం తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఫలితాల గురించి మాట్లాడిన అనంతరం.. రెవిన్యూ డిపార్ట్‌మెంట్‌లో అవినీతి వ్యవహారంపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటివల ఎమ్మార్వో కార్యాలయాలకు పెట్రోల్ డబ్బాలు తీసుకురావడం ఎక్కువైందని, ఎంత బాధ ఉంటే ప్రజలు అలా చేస్తారని సీఎం అన్నారు. దీనిపై ఆ డిపార్ట్‌మెంట్ వాళ్లు కూడా ఆలోచించుకోవాలని హితవు చెప్పారు, రెవిన్యూ ఉద్యోగులు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు.

అవినీతి ఎక్కువగా ఉన్న డిపార్ట్‌మెంట్ ఏదంటే నెంబర్ వన్ రెవెన్యూ శాఖనే అని అన్నారు కేసీఆర్. అంతులేని పైసలు ఏం చేసుకుంటారు? అని రెవెన్యూ డిపార్ట్‌మెంట్ ఉద్యోగులనుద్దేశించి సీఎం ప్రశ్నించారు. రెవెన్యూ శాఖలో అవినీతి, అరాచకం, విచ్చలవిడి తనాన్ని ఉపేక్షించబోమని తేల్చి చెప్పారు. ఎవరు ఏమనుకున్నా భయపడేది లేదన్నారు. ప్రజలే తమ బాస్‌లు అని పేర్కొన్నారు.  ప్రభుత్వాల్నే ప్రజలు తీసి పారేస్తున్నారని, అలాంటి రెవెన్యూ శాఖ ఒక లెక్కా? అని వ్యాఖ్యానించారు. త్వరలోనే కొత్త రెవెన్యూ చట్టాన్ని కచ్చితంగా తీసుకొస్తామని స్పష్టం చేశారు.

CM KCR sensational comments on the Revenue Department

 

 

Latest Updates