ఇంకెన్నేళ్లు.?..యాదాద్రి పనులపై కేసీఆర్ ఆగ్రహం

యాదాద్రి  ఆలయం పనులు ఆలస్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. శనివారం ఆలయ పనులను పరిశీలించిన కేసీఆర్ అక్కడ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రధానాలయం పనులు మినహా ఇతర పనులు ఆలస్యంగా జరగడాన్ని అధికారులను  ప్రశ్నించారు. పనులు పూర్తి చేయడానికి ఇంకెన్నేళ్లు పడుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల రోజుల్లో పనులన్నీ పూర్తి కావాల్సిందేనని ఆదేశించారు. నిధులు కావాలంటే వెంటనే విడుదల చేస్తాం..కానీ పనులు ఆలస్యం కావొద్దంటూ హెచ్చరించారు. వెంటనే రూ. 50 కోట్లు విడుదల చేయాలని ఆదేశించారు. మరో 15 రోజుల్లో మరో రూ.470 కోట్లు విడుదల చేస్తామన్నారు.  రహదారులపై విద్యుత్ స్తంభాలు ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు కేసీఆర్. టెంపుల్  ప్రాంగణంలో లోతైన సంపు నిర్మాణంపై అసంతృప్తి వ్యక్తం  చేశారు. గర్భాలయం ముందు దిమ్మె పరిమాణం తగ్గించాలని ఆదేశించారు కేసీఆర్.

 

Latest Updates