రోడ్డు ప్రమాదంపై కేసీఆర్ దిగ్భ్రాంతి

నల్లగొండ జిల్లా అంగడిపేట దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యాక్సిడెంట్ కు దారితీసిన పరిస్థితులపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో మృతిచెందిన కూలీల కుటుంబాలకు ముఖ్యమంత్రి ప్రగాఢ  సానుభూతిని తెలిపారు. గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన చికిత్స అందించాల్సిందిగా వైద్యాధికారులను ఆదేశించారు.

Latest Updates