ఐదేండ్లలో సంపద డబుల్​ చేసి చూపించినం

  • గోల్కొండ కోట నుంచి సీఎం కేసీఆర్​
  • బంగారు తెలంగాణకు పునాదులు పడ్డాయి
  • రూ. లక్షలోపు పంట రుణాల మాఫీకి ఆదేశించాం
  • బడ్జెట్​ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టం ప్రవేశపెడుతాం
  • పల్లెలు, పట్నాల సమూల మార్పునకు 60 రోజుల ప్లాన్​
  • గోదావరిలో 575 టీఎంసీలు అదనంగా వినియోగించుకుంటాం
  • ప్రజలందరికీ ఆరోగ్య పరీక్షలు.. రాష్ట్ర హెల్త్‌‌ ప్రొఫైల్‌‌ తయారు చేస్తాం
  • పెన్షన్​ వయోపరిమితి లిస్టు రెడీ చేస్తున్నాం: ముఖ్యమంత్రి

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపామని, బంగారు తెలంగాణ నిర్మాణానికి పునాదులు పడ్డాయని సీఎం కేసీఆర్​ తెలిపారు. తెలంగాణ స్థిరమైన ఆర్థిక వృద్ధిని కొనసాగిస్తున్నదని, 2018–-19 ఆర్థిక సంవత్సరంలో 14.84 శాతం వృద్ధి రేటుతో జీఎస్‌‌‌‌డీపీలో ముందు వరుసలో ఉన్నదని చెప్పారు. రాష్ట్ర సంపద ఐదేండ్లలో రెట్టింపయిందని, రాష్ట్రం ఏర్పడే నాటికి రూ. 4 లక్షల కోట్ల విలువైన సంపద ఉంటే, ఇప్పుడు రూ. 8.66 లక్షల కోట్లకు చేరుకున్నదని తెలిపారు. కాళేశ్వరం వంటి ప్రాజెక్టులను చూసి ప్రపంచమే అబ్బురపడుతున్నదని, శాంతిభద్రతల పరిరక్షణలో దేశంలోనే రాష్ట్రం ప్రథమ వరుసలో ఉందని అన్నారు. త్వరలో జరుగబోయే అసెంబ్లీ బడ్జెట్​ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెడుతామని ప్రకటించారు. గురువారం 73వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో సీఎం జాతీయ జెండాను ఎగురవేసి ప్రసంగించారు. ఉద్యోగావకాశాలు స్థానికులకే ఎక్కువగా దక్కాలనే లక్ష్యంతో కొత్త జోనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యవస్థను ఏర్పాటు చేశామని, లోకల్​ క్యాడర్​ ఉద్యోగాలు 95శాతం స్థానికులకే దక్కేలా  చట్టం చేశామని, కొత్త రిక్రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లన్నీ కొత్త వ్యవస్థ ఆధారంగానే జరుగుతున్నాయని తెలిపారు. కేసీఆర్​ ప్రసంగం ఆయన మాట్లల్లోనే..

ప్రజల కనీస అవసరాలకు ఇబ్బంది లేదు

పోరాడి సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని సరైన దిశలో పెట్టేందుకు గడిచిన ఐదేండ్లలో మనం చిత్తశుద్ధితో చేసిన ప్రయత్నాలు సఫలం అయ్యాయి. అవుతున్నాయి. ఆదర్శవంతమైన పాలనతో దేశం దృష్టిని ఆకర్షించగలిగాం.

ఈ ప్రగతి ప్రస్థానాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తాం. రాష్ట్రంలో శాంతిసామరస్యాలు వెల్లివిరు స్తున్నాయి. పేదలను ఆదుకునేందుకే సంక్షేమ రంగానికి ప్రాధాన్యం ఇచ్చాం. ప్రజలకు కనీస అవసరాలకు ఇబ్బందిలేకుండా చేయగలిగాం.

ఎంతోకాలంగా రాష్ట్రాన్ని వెంటాడుతున్న సమస్యలకు శాశ్వత పరిష్కారాలు సాధించుకోగలిగాం. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన జీవన విధ్వంసం సృష్టించిన దుష్పరిణామాలను అధిగమించి, ప్రజలు కనీస జీవన భద్రతతో బతకగలిగే దశకు తీసుకురాగలిగాం.

బూజుపట్టిన చట్టాలతో అపారనష్టం

అభివృద్ధి, సంక్షేమం పకడ్బందీగా అమలు చేయడం కోసం కొత్త పరిపాలనా విభాగాలను ఏర్పాటు చేశాం. అవినీతికి ఆస్కారం లేని పరిపాలన అందించేందుకు ప్రస్తుతమున్న చట్టాలు సరిపోవు. పాత చట్టాలను సమూలంగా మార్చాల్సి వచ్చింది.

అందుకే నూతన పంచాయతీరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నూతన మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చట్టాలను తీసుకువచ్చాం. కొత్త రెవెన్యూ చట్టం కూడా సిద్ధమవుతున్నది. ప్రజలు, రైతులకు ఎలాంటి యాతన లేకుండా సేవలందించడమే లక్ష్యంగా కొత్త రెవెన్యూ చట్టం రూపుదాల్చుతున్నది.

ఈ మూడు చట్టాల వెలుగులతో రాష్ట్రం కచ్చితంగా పరిశుభ్రమైన, పచ్చదనం వెల్లివిరిసే పల్లెలు, మున్సిపాలిటీలను తయారు చేసుకోగలదనే విశ్వాసముంది.

బూజుపట్టిన పాత రెవెన్యూ చట్టాలు రైతులకు, ప్రజలకు అపారనష్టం కలిగించాయి. ఈ నష్టాన్ని నివారించేందుకు కొత్త  చట్టాన్ని తెస్తున్నాం. అవినీతికి ఆస్కారం లేకుండా, అలసత్వానికి అవకాశం లేకుండా దీన్ని రూపొందిస్తున్నాం.

త్వరలో జరగబోయే అసెంబ్లీ బడ్జెట్​ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెడుతాం.

దేశమే నేర్చుకునే విధంగా భగీరథ

దేశమే అబ్బురపడి మన నుంచి నేర్చుకునే విధంగా రూపుదిద్దుకున్న మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భగీరథ పథకం ద్వారా రాష్ట్రంలో మంచినీటి ఎద్దడిని నివారించుకోగలిగాం. ఆసరా పింఛన్లను రెట్టింపు చేసుకున్నాం.

వృద్ధాప్య పింఛన్ల వయోపరిమితిని 65 నుంచి 57 ఏండ్లకు తగ్గించాం. దీనికి సంబంధించి అర్హుల జాబితాను రూపొందించే పనిలో అధికారులున్నారు.

పంట రుణాల మాఫీకి ఆదేశాలు

రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు విధానం దేశానికే ఆదర్శప్రాయమైంది.  ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఒక లక్ష రూపాయల వరకు ఉన్న పంట రుణాలను మాఫీ చేయడం కోసం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మిషన్​ కాకతీయ ద్వారా చెరువులన్నింటినీ పునరుద్ధరించున్నం.

చెత్త నిర్మూలన

పట్టణాలు, పల్లెల్లో 60 రోజుల ప్రత్యేక ప్రణాళికను అమలుచేయబోతున్నాం.

ఈ ప్లాన్​ అమలుకు ముందే ఫైనాన్స్​ కమిషన్​ గ్రాంట్​ నిధులను స్థానిక సంస్థలకు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

పరిశుభ్రమైన పరిసరాల్లోనే పరమాత్ముడు కొలువై ఉంటాడు. అపరిశుభ్రతే అనాగరికత వ్యవస్థకు సంకేతం.  ఆ చెడ్డపేరును తొలగించుకోవాలి. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, ప్రజలు, ప్రజాసంఘాల భాగస్వామ్యంతో సమగ్ర చెత్త నిర్మూలనకు నడుం కట్టాలి.

60 రోజుల తర్వాత గ్రామాలు, పట్టణాల రూపురేఖలు కచ్చితంగా మారాలి.  అన్ని పల్లెలు, పట్టణాలకు అవసరమైన మొక్కల కోసం స్థానిక సంస్థలే నర్సరీలు ఏర్పాటు చేసుకోవాలి.

అందరి మనోభావాలు గౌరవిస్తున్నాం

అన్నివర్గాల ప్రజల పండుగలకు సమాన హోదా కల్పించాం. అందరి మనోభావాలను గౌరవిస్తూ గంగాజమునా తెహజీబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పరిరక్షిస్తున్నాం.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లల కోసం 906 గురుకులాలు ఏర్పాటు చేసి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాం.

అడ్వకేట్లు, జర్నలిస్టుల సంక్షేమానికి దేశంలో మరెక్కడా లేని  ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాం.

ప్రజలందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, రాష్ట్ర హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రొఫైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తయారు చేయబోతున్నాం.

కంటి వెలుగు పథకంతో ప్రజలకు దృష్టి లోపాలు సరిచేసేకునే అవకాశం కల్పించాం.

బంగారు తెలంగాణకు పునాదులు

పోరాడి సాధించుకున్న తెలంగాణ పునర్నిర్మాణ ప్రణాళికను ఒక యజ్ఞంలా నిర్వహించాం. ప్రజల ప్రాథమిక అవసరాలు తీర్చడం కోసం పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం. తెలంగాణ ఒక ఆదర్శ రాష్ట్రంగా దేశం ముందు నేడు గర్వంగా నిలబడ్డది. బంగారు తెలంగాణ అనే సౌదం నిర్మించడానికి కావాల్సిన పునాదులు పడ్డాయి.   స్వరాష్ట్రంలో సుపరిపాలన అనే నినాదంతో ముందుకు సాగుదాం.

దేశానికి గొప్ప సందేశమిచ్చిన కాళేశ్వరం

ప్రపంచమే అబ్బురపడే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టును ఏపీ, మహారాష్ట్ర సీఎంల సమక్షంలో ప్రారంభించుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం పాలనా పరిణతికి, దౌత్యనీతికి, స్నేహ సంస్కారానికి ప్రతిబింబంగా కాళేశ్వరం నిలిచింది. ఇది దేశానికి గొప్ప సందేశాన్నిచ్చిందని యావద్దేశం కొనియాడుతున్నది. రాష్ట్రం అవలంబిస్తున్న లివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాలసీ అన్ని రాష్ట్రాలకు అనుసరణీయమైన విధానమని అందరూ అభిప్రాయపడుతున్నారు. కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టులు నిర్మించాలంటే 15 నుంచి 20 ఏండ్లు పడుతుంది. కానీ.. ఎండనూ, వాననూ, చలినీ లెక్క చేయకుండా రాత్రనక పగలనకా మూడు షిఫ్టుల్లో శ్రమించి మూడేండ్లలో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసిన ఇంజనీర్లు, అధికారులు, కార్మికులకు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ ప్రాజెక్టు ద్వారా యేటా 400 టీఎంసీల నీటిని ఉపయోగించుకునే అవకాశం ఏర్పడింది. సీతారామ ప్రాజెక్టు ద్వారా 100 టీఎంసీల నీటితో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు, దేవాదుల ప్రాజెక్టు ద్వారా 75 టీఎంసీల నీటితో ఉమ్మడి వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాకు నీళ్లిస్తాం. వచ్చే యేడాది జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి 575 టీఎంసీల నీటిని గోదావరిలో అదనంగా ఉపయోగించుకునే అవకాశముంది. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసి మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వికారాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రంగారెడ్డి జిల్లా రైతులకు నీళ్లిస్తాం. పాలమూరు జిల్లాలోని ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గోయింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసి జూరాలతో కలిపి 11.20 లక్షలకు ఎకరాలకు నీళ్లిస్తున్నాం.

అమరులకు నివాళి

గురువారం ఉదయం 9.59 గంటలకు ప్రసంగాన్ని ప్రారంభించిన సీఎం 10.20 గంటలకు ముగించారు. ఉదయం 10.23 గంటలకు గోల్కొండ కోట నుంచి వెళ్లిపోయారు. కోట ముఖద్వారం వద్ద సీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎస్​కే జోషి, డీజీపీ మహేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, జీఏడీ స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిన్హా తదితరులు సీఎంకు స్వాగతం పలికారు. మంచిర్యాల డీసీపీ రక్షితా కె.మూర్తి, టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీ అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమాండెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాజా ఆధ్వర్యంలో పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఎస్సీ గురుకుల విద్యార్థినులు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన కళాకారుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అంతకుముందు సీఎం కేసీఆర్​ సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని అమరవీరుల స్మారకం వద్ద నివాళులర్పించారు.

హైదరాబాద్​ అభివృద్ధికి స్పెషల్​ ప్లాన్​

ఐటీ ఎగుమతులు గత ఐదేండ్లలో రూ.52 వేల కోట్ల నుంచి రూ. లక్షా పదివేల కోట్లకు చేరాయి. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అభివృద్ధి కోసం ప్రత్యేక వ్యూహం అనుసరిస్తున్నాం. పేదలకు ఉచిత వైద్యం అందించేందుకు బస్తీ దవాఖాన్ల సంఖ్య మరింత పెంచుతాం. మెట్రోతో మెరుగైన రవాణా వ్యవస్థ అందుబాటులో ఉన్నది. రాష్ట్రంలో శాంతిభద్రతలతో పాటు ప్రకృతి వైపరీత్యాలు, జాతరలు, ఉత్సవాలను నిశితంగా గమనించేందుకు  హైదరాబాద్​లో నిర్మిస్తున్న కమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ త్వరలోనే అందుబాటులోకి వస్తుంది.

పంచాయతీరాజ్​ ఖాళీలన్నీ భర్తీ చేస్తాం

పల్లెలు, పట్టణాల అభివృద్ధి కోసం వార్షిక, పంచవర్ష ప్రణాళికలను రూపొందించుకోవాలి. వాటికి గ్రామ సభల ఆమోదం పొందాలి. ఆ ప్రణాళికల ప్రకారమే నిధులు ఖర్చు చేయాలి. తద్వారా పట్టణాలు, పల్లెలు పద్ధతి ప్రకారం ప్రగతి సాధించగలుగుతాయి. పల్లెలను ప్రగతి కేంద్రాలుగా మార్చేందుకు ప్రభుత్వం పంచాయతీరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విభాగాన్ని సంస్థాగతంగా బలోపేతం చేయాలని నిర్ణయించింది. ఈ శాఖలోని ఖాళీలన్నింటినీ వేగవంతంగా భర్తీ చేస్తుంది.

వారసత్వంగా పచ్చదనం

పట్టణ, పల్లె బడ్జెట్‌‌‌‌లో 10 శాతం నిధులు పచ్చదనం పెంచడానికి కేటాయించాలి. మొక్కలు నాటడం, వాటిని కాపాడే విషయంలో ఎలాంటి అలసత్వానికి తావివ్వొద్దు. మనం డబ్బుపెట్టి ఎన్ని సుఖాలైన కొనుక్కోవచ్చు. పర్యావరణ సమతుల్యం లేనప్పుడు కృత్రిమ సుఖాలు ఎన్ని ఉన్నా బతుకులు నరకప్రాయమవుతాయి. డబ్బు పెట్టి మనం వానలను కొనలేం… ప్రశాంతతను కొనలేం. పచ్చని చెట్లు, పరిశుభ్ర వాతావరణం మాత్రమే జీవితాలను సుఖప్రదం చేస్తాయి. ఒత్తిడిని తగ్గిస్తాయి. రాబోయే తరానికి ఆస్తిపాస్తులిస్తే సరిపోదు.. ఆకుపచ్చని పర్యావరణాన్ని వారసత్వంగా అందించడమే మన నిజమైన కర్తవ్యం కావాలి.

Latest Updates