నన్ను పోరా.. రారా అంటున్నారు.. నేను టెంప్ట్ అవుతే..

పిచ్చి ఆవేశాలకు పోయి…రెచ్చగొట్టే మాటలు వింటే మన భవిష్యత్ దెబ్బతింటుందని కేసీఆర్. టీఆర్ఎస్ బహిరంగసభలో కేసీఆర్ మాట్లాడుతూ పిచ్చి ఆవేశాలకు పోతేపిల్లల భవిష్యత్ నాశనం అవుతుందన్నారు. అందరీని గెలిపించండి…రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది. సీఎం అని కూడా వాడూ,వీడు అంటున్నారు. నేను టెంప్ట్ అవుతలేను. ఓపిక వహిస్తున్నా. మేం తలుచుకుంటే నషం కింద దంచికొడతం. మాకు బాసులు ఢిల్లీలో ఉండరు. మా ప్రజలే మా బాసులు. అన్ని జిల్లాపరిషత్ లో మేమే గెలిచాము. మమ్మల్ని అపాయింట్ చేసిన మా బాసులు మా ప్రజలే. గతంలో కంటే ఈ సారి నాలుగు సీట్లు అదనం సాధించబోతున్నాం. ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘనం విజయం సాధించబోతున్నాం అంటూ సీఎం కేసీఆర్ మరోసారి జోస్యం చెప్పారు.

 

Latest Updates