యూపీ సీఎం మనకు నీతులు చెప్పుడేంది ..ఆయన తికానానే సరిగ్గా లేదు

పక్క రాష్ట్రం వాళ్ళు మస్తు వస్తరు చెప్పి పోతరు.. ఈడ వుండేది ఇదే తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలినేనని గుర్తు చేశారు సీఎం కేసీఆర్. టీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ..నేను ఢిల్లీకి వస్తానని అక్కడ అందరు గజ గజ వణుకుతున్నారు.. ఇక్కడనే ఆపాలని అన్నీ రాష్ట్రాల నుంచి బీజేపీ నేతలు వస్తున్నారని అన్నారు. ఇలా ఎందుకు బయపడుతున్నారో తనకు అర్ధం కావడం లేదన్న కేసీఆర్ ..యూపీ సీఎం మనకు నీతులు చెబుతాడట.. ఆయన తికానానే సరిగ్గా లేదని ఎద్దేవా చేశారు. తలసరి ఆదాయంలో 28 నంబర్ ఆయన వచ్చి మనకు చెప్పుడేందని ప్రశ్నించారు. నేను బి పాస్ తెచ్చిన.. మీకు బి పాస్ కావాలా..కర్ఫ్యూ పాస్ కావాలా అని అడిగారు. అన్ని మతాలు..అన్ని కులాలు కలిసి వుండాలని అన్నారు కేసీఆర్

Latest Updates