క్లారిటీతోనే CAAను వ్యతిరేకిస్తున్నాం

CAAకు  వ్యతిరేకంగా ఇప్పటికే 7 రాష్ట్రాలు తీర్మానం చేశాయన్నారు సీఎం కేసీఆర్. సోమవారం అసెబ్లీలో మాట్లాడిన సీఎం.. తెలంగాణ CAAను వ్యతిరేకిస్తున్న 8వ రాష్ట్రమన్నారు. స్పష్టమైన అవగాహనతోనే CAAను వ్యతిరేకిస్తున్నామన్నారు సీఎం. ఢిల్లీ అల్లర్లలో 50 మందికి పైగా పౌరులు చనిపోయారన్న  సీఎం.. రాష్ట్ర సీఎం  అయిన తనకే బర్త్ సర్టిఫికేట్ లేదని తెలిపారు. కేంద్రాన్ని వ్యతిరేకిస్తే దేశ ద్రోహులు ఐపోతారా అని ప్రశ్నించారు సీఎం.

దేశంలోకి చొరబాట్లను తాము కూడా వ్యతిరేకిస్తున్నామన్నారు సీఎం కేసీఆర్. ఇలాంటి చట్టాలు దేశ ప్రతిష్టను దిగజారుస్తాయని తెలిపారు. ఎనిమిదేళ్లు ప్రయత్నించి UPA, NDAలు విఫలమయ్యాయన్న సీఎం… NPR అనేది  NRCకి తొలిమెట్టని హోంశాఖ రిపోర్టులోనే ఉందన్నారు. ఎవరు మాట్లాడినా దేశద్రోహులనడం  ట్రెండ్ అయిపోయిందన్నారు. అసెంబ్లీ తీర్మానం చేస్తే తెలంగాణ అసెంబ్లీ కూడా దేశ ద్రోహం చేసినట్లేనా  అని ప్రశ్నించారు.

మనది కులాతీత, మతాతీత దేశం అన్నారు సీఎం కేసీఆర్. చట్టంలో ముస్లింలను మినహాయించడం ఎలా కరెక్ట్ అవుతుందని ప్రశ్నించారు. భారత ప్రభుత్వం పునరాలోచించాలన్నారు సీఎం. MIMతో కలిసి పనిచేసినా…. ఎవరి అభిప్రాయం వారిదన్న సీఎం… ఇలాంటి చట్టాలు దేశానికి ఏమాత్రం మంచిది కాదన్నారు. అందిరికీ ఆమోదయోగ్యంగా ఉండే చట్టాలు తీసుకురావాలన్నారు సీఎం కేసీఆర్.

Latest Updates