సీఏఏపై అసెంబ్లీలో చర్చ జరగాల్సిందే..

సీఏఏపై అన్ని పార్టీలు తమ వైఖరీ చెప్పాల్సిందేనన్నారు సీఎం కేసీఆర్. సీఏఏపై అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతుండగా మధ్యలో జోక్యం చేసుకున్న సీఎం కేసీఆర్ సీఏఏను ఐదారు రాష్ట్రాలు వ్యతిరేకించాయన్నారు. సీఏఏపై పార్టీలకు భిన్నాప్రాయాలు ఉండటం తప్పుకాదన్నారు. అన్ని అంశాలపై సభలో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సీఏఏ బిల్లును తాము పార్లమెంట్ లో వ్యతిరేకించామన్నారు. దేశాన్ని కుదిపేస్తున్న అంశంపై అంసెంబ్లీలో చర్చ జరగాల్సిందేనన్నారు. రాష్ట్ర విజ్ఞప్తిని కేంద్రం అంగీకరిస్తుందా ? లేదా అన్నది ముఖ్యం కాదన్నారు. జీఎస్టీ డబ్బుల్లో రాష్ట్ర వాట  ఇవ్వడం లేదన్నారు. కేంద్రం రాష్ట్రానికి కేటాయిస్తున్న లెక్కలపై ఓవైసీ చెప్పేది నిజమేనన్నారు సీఎం కేసీఆర్.

see more news

వకీల్ సాబ్ .. మగువా మగువా సాంగ్ ప్రోమో

బ్రదర్ తో హీరోయిన్ బికినీ ఫోజులు..నెటిజన్లు ఫైర్

నటి జయప్రదపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

Latest Updates