బెంగపడకండి.. డిసెంబర్ 7 నుంచి వరద సాయం అందిస్తాం

ప్రధాని మోడీని వరదసాయం అడిగితే ఇవ్వలేదని అన్నారు సీఎం కేసీఆర్. ఎల్బీ స్టేడియంలో జరిగిన టీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ  హైదరాబాద్ వరదలు రావడంతో నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అందుకే వరద బాధితుల్ని ఆదుకునేందుకు రూ.10 వేలు సాయం అందించినట్లు చెప్పారు. పేదల్ని ఆదుకోవాలని ప్రయత్నిస్తే అడ్డుకున్నారన్న కేసీఆర్ వరద సాయం ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేయలేదన్నారు. ఇప్పటికే వరద సాయం రూ.650కోట్లు ఇచ్చామని, డిసెంబర్ 7 నుంచి వరద సాయం అందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

Latest Updates